- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Balakrishna: వరుపుల రాజా మృతి అత్యంత బాధకరం
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా మృతిపట్ల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు....

X
దిశ,డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా మృతిపట్ల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యువకుడు అయిన రాజా గుండెపోటుకు గురై మృతి చెందడం అత్యంత బాధకరమన్నారు. వరపుల రాజా నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. విలువలకు, నిబద్ధ రాజకీయాలకు కట్టుబడ్డ అరుదైన వ్యక్తిత్వం వరుపుల రాజాది అని చెప్పారు. స్నేహంలో అప్యాయత, సేవల్లో వినమ్రతతో అందరిని ఆకట్టుకునేవారని, రాజా మృతి టీడీపీకి తీరని లోటు అని బాలకృష్ణ పేర్కొన్నారు.
Next Story






