మారువేషంలో ప్రభుత్వ ఆస్పత్రిలోకి వెళ్లి.. ఎమ్మెల్యే ఏం చేశారంటే..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-04 08:23:56  IST  )

మారువేషంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మడకశిర ప్రభుత్వాసుపత్రిని తనిఖీలు చేశారు...

మారువేషంలో ప్రభుత్వ ఆస్పత్రిలోకి వెళ్లి.. ఎమ్మెల్యే ఏం చేశారంటే..?
X

దిశ, మడకశిర: మారువేషంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మడకశిర ప్రభుత్వాసుపత్రిని తనిఖీలు చేశారు. తలకు క్యాప్, ముఖానికి మాస్క్ ధరించి ఆస్పత్రి లోపలికి వెళ్లి ఆయన రోగుల యోగక్షేమాలను తెలుసుకున్నారు. డ్యూటీ డాక్టర్లు సమయపాలన పాటిస్తున్నారా..? లేదా ..? అని ఆరా తీశారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడారు. సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అయితే మారువేషంలో ఆస్పత్రికి ఎమ్మెల్యే వెళ్లడంతో రోగులు అవాక్కయ్యారు. ఆయన పని తీరుపై ప్రశంసలు గుప్పించారు.

Next Story