60 రోజుల్లో 339 అభివృద్ధి పనులు పూర్తి.. ఎమ్మెల్యేను అభినందించిన సీఎం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-15 03:32:37  IST  )

నెల్లూరు రూరల్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రికార్డ్ స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తి చేశారు..

60 రోజుల్లో 339 అభివృద్ధి పనులు పూర్తి.. ఎమ్మెల్యేను అభినందించిన సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy) ఆయన శైలే వేరు. ప్రజా సేవ కోసం ఎంతవరకైనా వెళ్తారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవకే అవుతారు. ఈ విషయం మరోసారి నిరూపణ అయింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఒకే రోజు 105 పనులకు ఆయన ప్రజలతో శంకుస్థాపన చేయించారు. మార్చి 6న చేపట్టిన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగించారు. దీంతో మొత్తం 339 అభివృద్ధి పనులు పూర్తి చేశారు.

తాజాగా ఈ పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందుకు నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, స్థానికులను ఆయన ఆహ్వానించారు. వాళ్లతోనే ఈ ప్రారంభోత్సవాలు చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ(Minister Narayana), ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Mp Vemireddy Prabhakar Reddy) పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో 339 అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) లేఖ రాశారు. అభినందనలు తెలిపారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) సైతం అభినందించారు.

Next Story