రౌడీలు, గూండాలకు భయపడను : ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-30 06:31:32  IST  )

తన ఆఖరి శ్వాస వరకూ ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

రౌడీలు, గూండాలకు భయపడను : ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తన ఆఖరి శ్వాస వరకూ ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అని కొందరు వ్యక్తులు మాట్లాడుతున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. కోటంరెడ్డి దానిపై స్పందించారు. సోషల్ మీడియా బెదిరింపులకు తాను భయపడనని, ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం వైసీపీ సోషల్ మీడియాకు కొత్తేం కాదన్నారు.

పదవులు, ఆస్తులు, అంతస్తుల కోసం సొంతవారినే చంపించే సంప్రదాయం, తోడబుట్టినవారిని వేధించే సంప్రదాయం తమది కాదన్నారు. రౌడీలు, గూండాలకు భయపడే వ్యక్తిత్వం కాదని, విద్యార్థి నేతగా విద్యార్థులపై జరుగుతున్న రౌడీయిజాన్ని తరిమికొట్టిన చరిత్ర తమ సొంతమన్నారు. తప్పు చేయనపుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి.. తనకోసం నిలబడిన కార్యకర్తలు, తననే నమ్ముకున్న ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్తానని, దేన్నైనా ఎదుర్కొంటానని తెలిపారు.

Next Story