- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన విచారణ.. ఎమ్మెల్యే కొలికపూడి సెన్సేషనల్ కామెంట్స్
టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విచారణ జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: తిరువూరు టీడీపీ కార్యాలయం(Tdp Office)లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(MLA Kolikapudi Srinivasa Rao) విచారణ జరిగింది. తిరువూరు నియోజకవర్గం(Thiruvur Constituency)లో ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొందరు కంప్లైంట్స్ ఇచ్చారు. దీంతో ఆయనపై టీడీపీ క్రమ శిక్షణ కమిటీ సీరియస్ అయింది. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం గోపాలపురం ఘటనపై కమిటీకి వివరించానని తెలిపారు. టీడీపీ కార్యకర్త మృతి చెందితే పరామర్శకు వెళ్లానని చెప్పినట్లు పేర్కొన్నారు. వైసీపీకి చెందిన కుటుంబం రోడ్డుపై ముళ్ల కంచె వేసిందని, స్థానికులకు ఇబ్బందిగా మారడంతో కంచెను తొలగించానని చెప్పారు. కంచెను తొలగించడంతో తనను టార్గెట్ చేశారని తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసి వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఆ వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేశారని పేర్కొన్నారు. వాస్తవాలు ఏంటో గ్రామస్తులు అడిగితే తెలుస్తుందని ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు తెలిపారు.






