- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రమ శిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే కొలికపూడి.. నివేదిక రూపంలో వివరణ
తిరువూరు విభేదాలపై ఎమ్మెల్యే కొలికపూడి వివరణ ఇచ్చారు..

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఎంపీ చిన్నితో నెలకొన్న విభేదాలపై ఆయన వివరణ ఇచ్చారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వయంగా హాజరై నివేదిక రూపంలో తన వాదనను అందజేశారు. ఇక చిన్ని సైతం తన వాదనను కమిటీ ముందు వినిపించనున్నారు.
తిరువూరు నియోజకవర్గంలో చిన్ని, కొలికపూడి మధ్య కొంతకాలంగా అంతర్గత పోరు నడిచింది. గత ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు కేశినేని చిన్ని డబ్బులు తీసుకున్నారని కొలికపూడి ఆరోపించారు. అంతేకాకుండా చిన్నికి వ్యతిరేకంగా తన వాట్సప్ స్టేటస్‌లో పోస్టులు పెట్టారు.
ఇక కొలికపూడిపై చిన్ని కూడా అదే స్థాయిలో విమర్శలు కురిపించారు. వైసీపీ నేతలతో కొలికపూడి టచ్‌లో ఉన్నారని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను కూడా విమర్శించే స్థాయికొచ్చారని మండిపడ్డారు. కొలికపూడి వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని చిన్న వ్యాఖ్యానించారు. అయితే ఇద్దరి తీరుపై అధిష్టానం సీరియస్ అయింది. క్రమ శిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఈ రోజు కొలికపూడి వివరణ ఇచ్చారు. కాసేపట్లో చిన్న సైతం ఇవ్వనున్నారు.
READ MORE ....






