ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తాం: జూలకంటి వార్నింగ్

by Vemula.Srinu Prasad |

మాచర్లలో అవివాహితపై జరిగిన అత్యాచార జరిగింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సీరియస్ అయ్యారు....

ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తాం: జూలకంటి వార్నింగ్
X

దిశ, మాచర్ల: మాచర్ల 13వ వార్డులో అవివాహితపై జరిగిన అత్యాచార జరిగింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సీరియస్ అయ్యారు. గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠితో ఫోను ద్వారా విషయం చెప్పారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని కోరారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేందుకు యత్నించే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. బాధితురాలికి అండగా నిలబడతామన్నారు. అలానే మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించామన్నారు. మహిళల భద్రతకు హాని చేయాలని చూసే ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

Next Story