ప్రజలే ఇవ్వలేదు.. మేమేంచేస్తాం: జగన్‌పై ఎమ్మెల్యే గంటా సెటైర్లు

by Vemula.Srinu Prasad |

జగన్ ప్రతి పక్ష హోదా ప్రజలు ఇవ్వలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సెటైర్లు వేశారు.

ప్రజలే ఇవ్వలేదు.. మేమేంచేస్తాం: జగన్‌పై ఎమ్మెల్యే గంటా సెటైర్లు
X

దిశ, వెశ్ డెస్క్: తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారా..?, ఇవ్వారా అని ప్రశ్నించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌(former Cm Jagan)కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Tdp Mla Ganta Srinivasrao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని, ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల పాలనపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. రుషికొండ(Rushikonda)పై రూ.500 కోట్లు ఖర్చుపెట్టారని గుర్తు చేశారు. అవే నిధులు మెడికల్ కాలేజీలకు ఇస్తే బాగుండేదన్నారు. పార్టీ కార్యాలయాలు తప్ప జగన్‌ ఇంకేమీ కట్టలేదని ఎద్దేవా చేశారు. పత్రిపక్ష హోదాపై ప్రభుత్వంపై జగన్‌ విమర్శలు బాధాకరమని ఎమ్మెల్యే గంటా వ్యాఖ్యానించారు.

Next Story