ఇదే ఘటన గిరిప్రదక్షిణ రోజు జరిగి ఉంటే.. సింహాచలం ఈవోపై ఎమ్మెల్యే గంటా ఫైర్

by Gantepaka Srikanth |

సింహాచలం ఆలయ ఈవో(Simhachalam Temple EO)పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు(MLA Ganta Srinivas Rao) సీరియస్ అయ్యారు.

ఇదే ఘటన గిరిప్రదక్షిణ రోజు జరిగి ఉంటే.. సింహాచలం ఈవోపై ఎమ్మెల్యే గంటా ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సింహాచలం ఆలయ ఈవో(Simhachalam Temple EO)పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు(MLA Ganta Srinivas Rao) సీరియస్ అయ్యారు. సింహాచలంలో రేకుల షెడ్ కూలిపోవడంపై మంగళవారం నిలదీశారు. ఎవరిని అడిగి షెడ్ నిర్మించారని ప్రశ్నించారు. ఇదే ఘటన గిరిప్రదక్షిణ రోజు జరిగి ఉంటే పరిస్థితి ఏంటని అడిగారు. ఆలయంలో ఇష్టం వచ్చినట్లు బదిలీలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో ఆలయ ప్రతిష్ట మసకబారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రస్తుతం ఆలయ పరిస్థితిని చూసి జనం నవ్వుకుంటున్నారని మండిపడ్డారు.

కాగా, సింహాచలం క్షేత్రంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటన జరిగిన రెండు నెలలకే తొలిపావంచా వద్ద షెడ్డు కూలింది. ఉత్సవం రోజున కూలి ఉంటే ప్రమాద తీవ్రత ఊహించలేనిదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలం అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్థానిక అధికారులు, నాయకులతో కలిసి ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.

Next Story