ఆదర్శంగా మహిళా ఎమ్మెల్యే.. జోరు వానలో సమస్యల పరిష్కారం..!

by Vemula.Srinu Prasad |

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పర్యటించారు....

ఆదర్శంగా మహిళా ఎమ్మెల్యే.. జోరు వానలో సమస్యల పరిష్కారం..!
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పర్యటించారు. జోరు వానలోనే కొబ్బరి తోట, నంబూరు సుభాని కాలనీ ,బాబు రాజేంద్ర ప్రసాద్ కాలనీ, సంపత్ నగర్‌లో ఆమె పర్యటించారు. జనావాసాల మధ్య ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి, వర్షపు నీరు నిలిచి ఉండటాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. వెంటనే పిచ్చి మొక్కలు తొలగించాలని అధికారులను ఆదేశించారు స్థానిక సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని చాలా డివిజన్లలో కనీసమౌళిక సదుపాయాలు లేకపోవడాన్ని స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వర్షాకాలం వచ్చిందంటే పీకలవాగుతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ఆమెకు తెలిపారు. నంబూరు సుభాని కాలనీలో చిత్తడి రోడ్లు, మురుగు నీరు పారుతోందని, దాని తమ ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పీకల వాగులోని వ్యర్ధాలను తొలగించి, రోడ్డు మీద వేయటం వలన తీవ్ర దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాటిని వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పీకల వాగు కట్టలో రోడ్లు, మంచి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలనీ కోరారు. కొబ్బరితోటలో నిర్మాణంలో ఉన్న మంచి నీటి రిజర్వ్ ట్యాంక్ వివరాలను అడిగి తెలుసుకొని, త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొబ్బరితోట ప్రాంతంలో గంజాయి యధేచ్చగా అమ్ముతున్నారని తెలియడంతో పోలీసులు ఉక్కుపాదం మోపాలని, పెట్రోలింగ్ పెంచాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో రాజీపడే పసక్తే లేదని తెలిపారు. చాలా డివిజన్లలో మౌలిక సదుపాయాలు లేవని, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి భారీగా నిధులు మంజూరు అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి హామీ ఇచ్చారు.

Next Story