- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి తన ఉదారతను, మానవత్వాన్ని చాటుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి తన ఉదారతను, మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం కొండవీడులో జరుగుతున్న ఉత్సవాలకు హాజరైన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా, ఫిరంగిపురం- కొండవీడు మధ్య రహదారిలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురై కారును ఢీకొని తీవ్రంగా గాయపడిన విషయాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గమనించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆలస్యం చేయకుండా తక్షణమే క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. రక్తస్రావంతో బాధపడుతున్న వారిని వెంటనే తన సొంత వాహనంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. ఆసుపత్రిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల చికిత్సలు అందేలా వ్యక్తిగతంగా పర్యవేక్షించారు.
ఎలాంటి పరిచయం లేని..
ఎలాంటి పరిచయం లేని తమను ప్రమాద సమయంలో ఆదుకుని, ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి మానవత్వానికి క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రతినిధి అంటే కేవలం పాలన పరమైన బాధ్యతలు మాత్రమే కాక, ప్రజల కష్టాల్లో తోడుండడమనే విషయాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి ఆచరణలో చూపించారని స్థానికులు ప్రశంసిస్తున్నారు.






