- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టోల్ ప్లాజా వద్ద దారుణం.. సిబ్బందిని చితకబాదిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు వీరంగం సృష్టించారు..

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamayya District) వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా(Gandaboyanapalle Toll Plaza) వద్ద టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు(TDP MLA Amilineni Surendrababu) అనుచరులు వీరంగం సృష్టించారు. తమ వాహనాలుకు టోల్ ఫీజు అడిగారని దౌర్జన్యానికి పాల్పడ్డారు. టోల్ సిబ్బందిపై విచక్షణగా రహితంగా దాడి చేశారు. అడ్డువచ్చిన మహిళా సిబ్బందిని జుట్టుపట్టుకుని పిగుగుద్దులు కురిపించారు. తాము అధికారంలో ఉన్నామని, తమ బండినే ఆపుతారా అంటూ రెచ్చిపోయారు. టోల్ సిబ్బంది, శ్రీలత, మేనేజర్ రవిపై దాడి చేశారు. అనంతరం రవిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఇప్పటి వరకూ టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదులు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి చేసింది టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కాబట్టి కేసు పెట్టకుండా మేనేజ్ చేసి ఉంటారని పలువురు వైసీపీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే అనుచరుల దాడిని తప్పుబట్టారు. ఇప్పటికైనా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.






