ఉచిత బస్సు రథ సారదిగా మారిన ఎమ్మెల్యే బాలయ్య

by Malleboina Mahesh |

ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా బస్సును నడిపాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఉచిత బస్సు రథ సారదిగా మారిన ఎమ్మెల్యే బాలయ్య
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (coalition government) మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. సూపర్‌సిక్స్ పథకాల్లో భాగంగా ఈ రోజు శ్రీ శక్తి పథకం కింద.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని (Free bus travel scheme) సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అలాగే అన్ని జిల్లా మండల కేంద్రాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna) తన నియోజకవర్గంలో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో స్వయంగా ఆయన ఆర్టీసీ బస్సును నడపడంతో మహిళలు కేరింతలు కొట్టారు. హిందూపురం RTC బస్ స్టేషన్ నుండి చౌడేశ్వరి కాలనీ తన నివాసం వరకు ప్రయాణికులతో కలిసి బస్సును నడిపారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story