అమరావతిలో బసవతారకం సేవలు.. పలుగు, పార పట్టి పనులు ప్రారంభించిన బాలకృష్ణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-01 08:04:07  IST  )

గుంటూరు జిల్లా తుళ్లూరుకు సమీపంలో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి చైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీకారం చుట్టారు..

అమరావతిలో బసవతారకం సేవలు.. పలుగు, పార పట్టి పనులు ప్రారంభించిన బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur) తుళ్లూరు(Tullur)కు సమీపంలో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి(Basavatarakam Cancer Hospital) నిర్మాణానికి చైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణ(Mla Balakrishna) శ్రీకారం చుట్టారు. స్వయంగా ఆయనే పలుగు, పార పట్టి పనులు ప్రారంభించారు. పలుగుతో గుంత తొవ్వి పారతో మట్టి తీసి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 21 ఎకరాల్లో రూ. 750 కోట్ల వ్యయంతో ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు విభజిత ఏపీలోనూ సేవలు కొనసాగించేందుకు బసవతారకం ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తుళ్లూరులో సమీపంలో కేన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులను స్వయంగా దగ్గరుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేసిన పనులను ప్రారంభించారు.

Next Story