- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో బాలయ్య సీరియస్.. తనను అవమానించారంటూ ఆగ్రహం
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు...

దివ, వెబ్ డెస్క్: అసెంబ్లీ(Assembly) వేదికగా ప్రభుత్వం(Government)పై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Mla Nandamuri Balakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి(Chiranjeevi)ని జగన్ (Jagan)గతంలో అవమానించారని, కలిసేందుకు కూడా ఇష్టపడలేదని, నిలదీయంతోనే కలిశారని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు(Bjp Mla Kamineni Srinivasarao) చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కామినేని ఉదాహరణను బాలకృష్ణ తప్పుబట్టారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగి వచ్చారన్నది అబద్ధమని చెప్పారు. ఎవరూ గట్టిగా అడగలేదని తెలిపారు. అయితే తనను కూటమి ప్రభుత్వం కూడా అవమానించిందని మండిపడ్డారు. ఎఫ్డీసీ సమావేశంలో తన పేరు తొమ్మిదివ స్థానంలో పెట్టారని, ఆ లిస్ట్ తయారు చేసింది ఎవరంటూ ప్రశ్నించారు. తనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేశ్(Minister Kanduala Durgesh)కు ఫోన్ చేసి అడిగానని బాలకృష్ణ తెలిపారు.






