భావోద్వేగానికి లోనై అలా ప్రవర్తించా: ఎమ్మెల్యే అరవింద్‌ బాబు వివరణ

by Vemula.Srinu Prasad |

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు ఇటీవల ఎస్పీ ఆఫీసులో లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో వ్యవహరించిన తీరుపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు...

భావోద్వేగానికి లోనై అలా ప్రవర్తించా: ఎమ్మెల్యే అరవింద్‌ బాబు వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు(Narasaraopeta MLA Dr. Aravinda Babu) ఇటీవల ఎస్పీ ఆఫీసులో లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో వ్యవహరించిన తీరుపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(AP TDP State President Palla Srinivasa Rao) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావును ఎమ్మెల్యే కలిశారు. స్థానిక పరిస్థితులు, గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా భావోద్వేగానికి లోనై అలా ప్రవర్తించాల్సి వచ్చిందని అరవింద బాబు తన వివరణ ఇచ్చుకున్నారు.

ఎమ్మెల్యే వివరణపై...

అయితే ఎమ్మెల్యే వివరణపై పల్లా శ్రీనివాసరావు స్పందిస్తూ వ్యక్తిగత కారణాలు ఏవైనా పార్టీ క్రమశిక్షణను అతిక్రమిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వానికి లేదా పార్టీకి చెడ్డపేరు తెచ్చే ఏ చర్యలనైనా ఉపేక్షించబోమని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు హుందాతో వ్యవహరించాలని, అధికారుల పనితీరుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సరైన వేదికలపై ఫిర్యాదు చేయాలే తప్ప ఇలాంటి ఘటనలకు తావు ఇవ్వకూడదని సూచించారు.

మార్పు కోరుకుంటున్నారు...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఇలాంటి వివాదాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం చూపుతాయని పల్లా ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, ప్రతి ఒక్కరూ పార్టీ నియమావళికి కట్టుబడి ఉండాలని గట్టిగా చెప్పారు.

Next Story