- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరికొద్దిసేపట్లో జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శ్రీధర్ కమిటీ ముందు హాజరవుతారు.

దిశ, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరికొద్దిసేపట్లో జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శ్రీధర్ కమిటీ ముందు హాజరవుతారు. శ్రీధర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఆయనను విచారించనుంది. ఎమ్మెల్యేతో పాటు స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సైతం కమిటీ సేకరించనుంది. ఇక శ్రీధర్ వ్యవహారంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ఓ సమావేశంలో నిప్పులు చెరగ్గా ఆయన ఈ రోజు కమిటీ ముందుకు రావడం విశేషం. అందరి చిట్టా తన దగ్గర ఉందని పవన్ సమావేశంలో మండిపడ్డారు. ఏం చేస్తారో రిపోర్ట్ ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ కు చెప్పి పవన్ అక్కడ నుండి వెళ్లిపోయారు.
నిజానికి శ్రీధర్‌కు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చి చాలా రోజులు అవుతోంది. కానీ శ్రీధర్ మాత్రం విచారణకు హాజరవ్వలేదు. అంతేకాకుండా ఆయన అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ నిన్న ఆగ్రహంతో ఊగిపోగా మరుసటి రోజే శ్రీధర్ కమిటీ ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే యువ ఎమ్మెల్యేపై వీణ అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. అరవ శ్రీధర్ తనను ప్రేమించి మోసం చేశాడని చెప్పింది. తన భర్తకు విడాకులు ఇవ్వాలని శ్రీధర్ తనను పట్టుబట్టాడని చెప్పింది. తనకు ఐదు సార్లు అబార్షన్ చేయించాడని ఆరోపించింది. శ్రీధర్ తనతో మాట్లాడిన వీడియో కాల్స్, చాటింగ్ వివరాలను వాణి లీక్ చేస్తూనే ఉంది. మరోవైపు అసెంబ్లీలోనూ అరవ శ్రీధర్ మహిళతో వీడియో కాల్ మాట్లాడటం సంచలనంగా మారింది.






