పవన్ కల్యాణ్ గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి : మరో వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ

by Naga Rani Yarlagadda |

ఎమ్మెల్యే, విప్ పదవి లేకుండా శ్రీధర్ మామూలు వ్యక్తి అయి ఉంటే.. అతను తనకు చేసిన ద్రోహానికి ఈ పాటికి అరెస్టై జైల్లో ఉండేవాడని బాధితురాలు హర్షవీణ వాపోయింది.

పవన్ కల్యాణ్ గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి : మరో వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే, విప్ పదవి లేకుండా శ్రీధర్ మామూలు వ్యక్తి అయి ఉంటే.. అతను తనకు చేసిన ద్రోహానికి ఈ పాటికి అరెస్టై జైల్లో ఉండేవాడని బాధితురాలు హర్షవీణ వాపోయింది. జనసేన విప్ అరవ శ్రీధర్ విషయంలో ఆమె మరో వీడియో విడుదల చేసింది. పదవిలో ఉన్నాడు కాబట్టే అతను ధైర్యంగా బయట తిరుగుతున్నాడని ఆరోపించింది. దీనిని బట్టి చూస్తే.. అందరూ ఈ విషయంపై పాలిటిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. అధికారాన్ని ఉపయోగించుకుని జరిగిన విషయంపై రాజకీయం చేస్తున్నది అతనేనని, తాను ఎలాంటి పాలిటిక్స్ చేయట్లేదని తెలిపింది. తనకు జరిగిన అన్యాయాన్ని డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ను కలిసి వివరించాలని, తనకు ఆయనే న్యాయం చేయాలని వీడియోలో వేడుకుంది. ఆయన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఇతరుల నుంచి మాటలు పడాల్సిన దౌర్భాగ్యం తనకు పట్టలేదని, ఒక్కసారి కలిసే అవకాశం ఇస్తే.. అసలేం జరిగిందో వివరిస్తానని హర్షవీణ తాజా వీడియోలో తెలిపింది.

ఇటీవలే ఈ కేసులో అరవ శ్రీధర్ జనసేన త్రిసభ్య కమిటీ ఎదుట హాజరయ్యారు. తనవద్ద ఉన్న ఆధారాలను వారికి అందించానని, అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కు ముడిపెట్టి మాట్లాడవద్దని ఆయన కోరారు.

Next Story