- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం.. హైకోర్టును ఆశ్రయించిన బాధితురాలు హర్షవీణ
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేశారని, తనపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టివేయాలని కోరుతూ బాధితురాలు హర్షవీణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) వ్యవహారంలో బాధితురాలు హర్షవీణ ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు. తనపై నమోదైన అక్రమ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆమె క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆమె పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హర్షవీణ తరపున న్యాయవాదులు సాయిక్రిష్ణ, గల్లా సతీశ్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని హర్షవీణను మోసం చేశారని, ఆమె ఎదురుతిరగడంతో పోలీసుల ద్వారా కావాలనే తప్పుడు కేసులు పెట్టించారని కోర్టుకు తెలిపారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అన్యాయంగా ఓ మహిళను మహిళను వేధింపులకు, భయాందోళనకు గురిచేస్తున్నారని, ఆమెపై నమోదైన కేసుల్లో ఎటువంటి వాస్తవం లేదని వాదించారు.
అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు..
ఎమ్మెల్యే హోదాలో అరవ శ్రీధర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హర్షవీణ తాను దాఖలు చేసిన పిటిషన్ స్పష్టంగా పేర్కొన్నారు. తనను మోసం చేయడమే కాకుండా, న్యాయం కోరినందుకు అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే తనపై పెట్టిన తక్షణమే కొట్టివేసి తనకు న్యాయం చేయాలని హర్షవీణ న్యాయస్థానాన్ని కోరారు.






