వివాదాస్పదంగా మారిన ప్రభుత్వం ‘కమ్మ’గానే ఉంది వ్యాఖ్యలు: ఎమ్మెల్యే వివరణ

by Gantepaka Srikanth |

ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది. కమ్మ సామాజికవర్గ నేతల ఆధిపత్యమే కొనసాగుతోంది.

వివాదాస్పదంగా మారిన ప్రభుత్వం ‘కమ్మ’గానే ఉంది వ్యాఖ్యలు: ఎమ్మెల్యే వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది. కమ్మ సామాజికవర్గ నేతల ఆధిపత్యమే కొనసాగుతోంది. కులాలకు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలి. ప్రభుత్వంలో కేవలం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కడం సరికాదు అని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(MLA Adinarayana Reddy) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలకు ఆదినారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

కూటమిలో కుట్రకు జగన్ ప్లాన్

కూటమిని విడదీయాలని జగన్ కుట్రలు చేస్తున్నారు. కావాలనే నా వ్యాఖ్యలను వక్రీకరించి కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నా మాటలను వక్రీకరించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. కమ్మటి రాజ్యం అంటే బాగుండాలనేదే నా ఉద్దేశం. నేనేం తప్పుగా మాట్లాడానని వివరణలు, సవరణలు ఇవ్వాలి. అయినా కూడా ఎవరిని అయినా నా మాటలు ఇబ్బంది పెట్టి ఉంటే చింతిస్తున్నాను అని ఆదినారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు.

Next Story