- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా డబ్బులు మాకిస్తే రాజీనామా చేస్తాం: ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు అల్టిమేటం
2024 ఎన్నికల్లో తాము రూ. 100 కోట్లు ఖర్చు పెట్టామని, ఆ డబ్బులు ఇస్తే తన తండ్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ అల్టిమేటం ప్రకటంచారు. ...

దిశ, వెబ్ డెస్క్: 2024 ఎన్నికల్లో తాము రూ. 100 కోట్లు ఖర్చు పెట్టామని, ఆ డబ్బులు ఇస్తే తన తండ్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ అల్టిమేటం ప్రకటంచారు. సత్యవేడు నియోజకవర్గం తన తంగ్రి ఆదిమూలంపై జరుగుతున్న ప్రచారం, విమర్శలపై ఆయన స్పందించారు. తన తండ్రిపై పార్టీలోని వారే కుట్రలు చేశారని సుమన్ ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సత్యవేడులో అమలు కావడం లేదన్నారు. ఒక ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల వ్యక్తిని ఇన్‌చార్జ్‌గా ఎలా నియమిస్తారని మండిపడ్డారు. తాము ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తమకు తిరిగి ఇవ్వాలని.. డబ్బులు పెట్టి కష్టపడి సీటు గెలిచామని తెలిపారు. తాము ఖర్చు పెట్టిన డబ్బును తిరిగి ఇస్తే చాలు అని చెప్పారు. గౌరవం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకు..? అని ప్రశ్నంచారు. సత్యవేడు సీఐ ప్రతి రోజూ ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాను దగ్గరుండి చేయిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా లైంగిక వేధింపుల వివాదంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పైగా ఆయన్ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గానికి పార్టీ తరపున కొత్త ఇంచార్జిని నియమించారు. ఈ పరిణామాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం తనయుడు సుమన్ తప్పుబడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత నేపతలపైనే సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశంగా మారాయి.






