మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి

by velandi.Saikiran |   (  Updated:2025-07-20 07:12:04  IST  )

వైసీపీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డికి ( Mp Mithun REddy) వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాసేపటి క్రితమే... మిథున్ రెడ్

మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి
X
  • విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద మిథున్ రెడ్డి
  • వైద్య పరీక్షల అనంతరం మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డికి ( Mp Mithun REddy) వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాసేపటి క్రితమే... మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. అనంతరం ఆసుపత్రి నుంచి నేరుగా విజయవాడ ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని తరలిస్తున్నారు పోలీసులు. నిన్న లిక్కర్ స్కాం లో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని ఏడు గంటల పాటు ప్రశ్నించిన సిట్... కీలక విషయాలను రాబట్టింది. ఈ తరుణంలోనే నిన్న మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు.

మిథున్ రెడ్డి అరెస్టుతో ఇప్పటి వరకు ఈ కేసులో 12 మంది జైలుకు వెళ్లారు. విచారణ అనంతరం నిన్న మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లోనే ఏసీబీ కోర్టు ముందు మిథున్ రెడ్డిని హాజరు పరుచనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రిమాండ్ విధించే ఛాన్స్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇక అటు ఈ లిక్కర్ స్కాం లో కూడా... సిట్ చార్జ్ షీట్ లో జగన్ పేరు కూడా పలుసార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Next Story