ఏపీ సచివాలయం వద్ద తప్పిన ముప్పు

by Thanuru Gopichand |

ఏపీ సచివాలయం (AP Secreteriat) వద్ద ఓ కారు ప్రమాదానికి (Car Accident) గురైంది. వేగంగా వెళ్లి సచివాలయంలోని కియా ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ ను ఢీకొట్టింది.

ఏపీ సచివాలయం వద్ద తప్పిన ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సచివాలయం (AP Secreteriat) వద్ద ఓ కారు ప్రమాదానికి (Car Accident) గురైంది. వేగంగా వెళ్లి సచివాలయంలోని కియా ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ ను ఢీకొట్టింది. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. పోలీసుల వివరాల ప్రకారం సోమవారం ఓ కారు సచివాలయం అవుట్ గేటు నుంచి వేగంగా వచ్చింది. గేటును దాటుకుంటూ లోపలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కారు టైరు పేలిపోయింది. దీంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. అదుపు తప్పిన కారు వేగంగా కియా ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ వైపు వెళ్లింది. ఒక్కసారి చార్జింగ్ స్టేషన్ ను ఢీకొట్టింది.

దీంతో చార్జింగ్ స్టేషన్ గోడ దెబ్బతినింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే కారు డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించారు. కారు డ్రైవరును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు సీఆర్డీఏకు చెందిన అద్దె వాహనంగా పోలీసులు గుర్తించారు.

Next Story