- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం దుకాణం వద్ద దారుణం.. వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన దుండగులు
by Vemula.Srinu Prasad |
గుంటూరు జిల్లా తాడికొండలో ఓ మద్యం దుకాణం వద్ద ఆదివారం దారుణం జరిగింది. మరియదాసు అనే వ్యక్తిని నలుగురు దుండగులు చుట్టుముట్టి, రాళ్లతో అతి కిరాతకంగా కొట్టి హతమార్చారు...

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur District) తాడికొండ(Tadikonda)లో ఓ మద్యం దుకాణం(Wine Shop) వద్ద ఆదివారం దారుణం జరిగింది. మరియదాసు అనే వ్యక్తిని నలుగురు దుండగులు చుట్టుముట్టి, రాళ్లతో అతి కిరాతకంగా కొట్టి హతమార్చారు. బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగానే జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలను కలిగించింది. తీవ్ర గాయాలపాలైన మరియదాసు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
స్థానికుల సమాచారంతో...
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యకు పాత కక్షలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
Next Story






