Tirumala : తిరుమల కొండపై అపచారం !

by Y. Venkata Narasimha Reddy |

తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రంలో అపచారం చోటుచేసుకుంది. నిషేధిత ఆహార పదార్ధాల(Pprohibited Foods)తో తిరుమల కొండ(Tirumala Hill)పైకి చేరుకున్న భక్తుల నిర్వాకం వివాదస్పదమైంది.

Tirumala : తిరుమల కొండపై అపచారం !
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రంలో అపచారం చోటుచేసుకుంది. నిషేధిత ఆహార పదార్ధాల(Pprohibited Foods)తో తిరుమల కొండ(Tirumala Hill)పైకి చేరుకున్న భక్తుల నిర్వాకం వివాదస్పదమైంది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు ఓ డబ్బా నిండా కోడి గుడ్లు, పలావ్(Chicken Eggs, Palawan)తో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి సెక్యూరిటీ తనిఖీ(Security Check)దాటుకొని (Crossing Over)తిరుమల కొండపైకి వచ్చిన ఆ భక్త బృందం రాంభాగిచ్చ బస్టాండ్ ఆవరణలో కోడిగుడ్డు, పలావ్ తింటుండగా..గమనించిన ఇతర భక్తులు పోలీసులకు సమాచారం అందించారు.

భక్తుల ఫిర్యాదుతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు తమిళనాడు భక్త బృందం వద్ద ఉన్న ఆహారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తమకు నిషేధిత పదార్ధాలన్న సంగతిపై అవగాహాన లేకపోవడంతోనే ఈ తప్పు జరిగిందని..ఉద్ధేశపూర్వకంగా చేయలేదని భక్తులు పోలీసుల(Police)కు వివరించారు. దీంతో పోలీసులు ఆ భక్తులను మందలించి తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టరాదని హెచ్చరించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

కాగా భక్తులు నిషేధిత పదార్ధాలతో అలిపిరి చెక్ పోస్టు దాటి కొండపైకి చేరుకున్న తీరుతో అలిపిరి తనిఖీ కేంద్రం వైఫల్యంపై విమర్శలు రేగుతున్నాయి. ఇటీవల తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం..అనంతరం పద్మానాభ నిలయం భవనంపై ఓ బాలుడు కింద పడి మృతి చెందడం..ఇప్పుడు తనిఖీ కేంద్రం దాటుకొని నిషేధిత ఆహారం తిరుమల కొండపైకి చేరుకున్న ఘటనలు వరుసగా టీటీడీ పనితీరును వరుస విమర్శల పాలు చేస్తున్నాయి.

Next Story