- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pagan Propaganda: తిరుమలలో మరోసారి అపచారం
తిరుమలలో మరోసారి అపచారం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో మరోసారి అపచారం జరిగింది. వెంకన్న(Venkanna) సన్నిధిలో ఎలాంటి పరమత ప్రార్థనలు చేయకూడదనే నిబంధనలు ఉన్నా ఓ వ్యక్తి యదేచ్ఛగా ఉల్లంఘించారు. తిరుపతి అలిపిరి నుంచి వాహనంతో తిరుమల కల్యాణ్ వేదిక(Tirumala Kalyan Vedika) వద్దకు వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం సమయంలో నమాజ్(Namaz) చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ ఫుటేజ్‌లో నమోదు అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తి నమాజ్ చేయడాన్ని అటు స్థానికులు సైతం గమనించారు. వెంటనే టీటీడీ(TTD)కి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తిరుమలకు వచ్చిన ఆ వ్యక్తి వాహనం నెంబర్ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్నా అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమతస్తులు ప్రార్ధనలు చేయడం వెంకన్న స్వామికి అపచారం చేయడమేనని భక్తులు మండిపడ్డారు. గత ఘటనల దృష్ట్యా ఇప్పటికైనా పటిష్ట నిఘా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు చేస్తున్నారు.






