తిరుమలలో అపచారం.. వ్యక్తి అరెస్ట్

by srinivas |   ( Updated:2025-04-16 01:22:58.0  )
తిరుమలలో అపచారం.. వ్యక్తి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో మరోసారి అపచారం(Mischief) జరిగింది. శ్రీవారి ఆలయ(Srivari Temple) పరిసరాల్లో డ్రోన్‌ కెమెరా(Drone camera) వినియోగించారు. మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన భక్తుడు దాదాపుగా 10 నిమిషాలు పాటు డ్రోన్‌ కెమెరా ద్వారా ఆలయం పరిసరాలను చిత్రీకరించారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుడిని పట్టుకుని టీటీడీ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం భక్తుడిని అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల కాలంలో తిరుమలలో భద్రత వైఫల్యం బయటపడుతుండటంతో టీటీడీపై కొందరు భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఇక నుంచైనా సరైన భద్రత ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శ్రీవారి ఆలయంపై నో ఫ్లైయింగ్ జోన్ అని తెలిసినా కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని టీటీడీ అధికారులు సైతం మండిపడ్డారు. ఇక నుంచి నిబంధనలు పాటించకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story

Most Viewed