- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో అద్భుతం.. రైతు పొలంలో శ్రీవారి పురాతన విగ్రహం
by Vemula.Srinu Prasad |
తిరుపతిలో అద్భుతం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati) పేరు వినగానే గుర్తొచ్చేది తిరుమల పుణ్యక్షేత్రం(Tirumala Temple). ఈ ఆధ్యాత్మిక నగరంలో వెంకన్న(Vekanna) కొలువు దీరారు. దీంతో భక్తులు ఎప్పుడూ కిటకిటలాడుతుంటారు. గోవింద నామ స్మరణతో ప్రతినిత్యం శ్రీవారి(Srivaru) ఆలయం మారుమోగిపోతుంటుంది. ఎంతటి కష్టమొచ్చినా శ్రీవారిని దర్శించుకుంటే వచ్చే భాగ్యమే వేరని భక్తులు చెబుతుంటారు. అయితే ఈ టెంపుల్ సిటీలో ఈ రోజు మహాద్భుతం జరిగింది. శ్రీవారు స్నానం చేసిన నామాల కాలువ దగ్గర ఉన్న ఓ రైతు పొలంలో పురాతన విగ్రహం బయటపడింది. అయితే విగ్రహంపై స్పష్టంగా స్వామివారి పాదాలు కనబడుతున్నాయి. పద్మావతి అమ్మవారిని కళ్యాణమాడిన శ్రీనివాసుడు రామచంద్రాపురం మండలం నడవలూరు నెన్నూరు పంచాయతీల మధ్య ఉన్న కాలువ దగ్గర స్నానం చేసి నామాలు ధరించారని భక్తుల నమ్మకం.
Next Story






