పవన్ కల్యాణ్‌కు పువ్వు ఇచ్చిన మంత్రులు

by Gantepaka Srikanth |

పవన్ కల్యాణ్‌కు పువ్వు ఇచ్చిన మంత్రులు

పవన్ కల్యాణ్‌కు పువ్వు ఇచ్చిన మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను పలువురు మంత్రులు కలిశారు. తమ నియోజకవర్గ గ్రామాల్లోని రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై డిప్యూటీ సీఎం పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రోడ్లతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారని.. ఆ రోడ్లు ఇప్పుడు బాగుపడతాయని, ప్రజల తరపున తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని డిప్యూటీ సీఎంకు చెప్పారు. కలిసిన మంత్రుల్లో పయ్యావుల కేశవ్, అనిత, నారాయణ, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సవిత, స్వామి, రాంప్రసాద్ రెడ్డి సహా పలువురు ఉన్నారు.

మొదటి విడతగా పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణలకు నిధులు మంజూరు చేస్తూ ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ జీవో జారీ చేసింది. మొత్తంగా 157 నియోజకవర్గాల్లో 1299 రోడ్ల పటిష్టత చేపట్టనుంది. రూ. 2123 కోట్ల మేర సాస్కీ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాల పరిధిలోని 157 నియోజకవర్గాల్లోని 4007 కిలో మీటర్ల మేర రోడ్లను పటిష్టపరిచేలా మొదటి విడతలో కార్యాచరణ చేపట్టారు. పల్లె పండుగ 2.0 పేరిట చేపట్టే రహదారి నిర్మాణాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవలే శంకుస్థాపన చేశారు.

Next Story