సైబర్ నేరగాళ్ల వలలో మంత్రి అల్లుడు.. ఏకంగా రూ.1.96 కోట్లు స్వాహా

by Kema Shiva Kumar |

ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber ​​criminals) రెచ్చిపోతున్నారు.

సైబర్ నేరగాళ్ల వలలో మంత్రి అల్లుడు.. ఏకంగా రూ.1.96 కోట్లు స్వాహా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber ​​criminals) రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో అంతటా క్యాష్ పేమెంట్స్ నిలిచిపోయి, ఆన్‌లైన్ పేమెంట్స్ అందుబాటులోకి రావడంతో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. క్యూఆర్ కోడ్స్, లింకులతో జనాల వద్ద ఉన్న సొమ్మును దర్జాగా కాజేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా సైబర్ నేరగాళ్లు ఏకంగా మంత్రి నారాయణ (Minister Narayana) అల్లుడి పునీత్‌ (Punith)ను బురిడీ కొట్టించారు. ఇటీవల పునీత్ పేరుతో అతడి కంపెనీ అకౌంటెంట్‌ మొబైల్‌‌కు ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రానికి చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లు మెసెజ్ పంపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నానని అర్జెంటుగా రూ.1.96 కోట్లు కావాలంటూ మెసేజ్ రావడంతో అకౌంటెంట్ ఏమి ఆలోచించకుండా నగదు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే, తాము మోసపోయామని గ్రహించిన పునీత్, అకౌంటెంట్ జరిగిన సైబర్ క్రైమ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులు అరవింద్ కుమార్‌తో పాటు సంజీవ్‌లను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Next Story