‘ఆ పథకం అమలు కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

‘ఆ పథకం అమలు  కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు హామీలను అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో విజయనగరం(Vijayanagaram) జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై మాట్లాడారు. ఏపీలో ఇప్పటికే సూపర్ సిక్స్(Super six) హామీల్లో భాగంగా పలు పథకాలు అమలు చేశారన్నారు.

ఈ తరుణంలో ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు పథకం(Free Bus Journey) అమలు కానుందని మంత్రి గుర్తుచేశారు. ఇక ఒక్కటే పథకం మిగిలింది అన్నారు. ఈ క్రమంలోనే ఆడబిడ్డ నిధి పథకం పై మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘18 ఏళ్లు నిండిన మహిళలకు ‘ఆడబిడ్డ నిధి పథకం’ కింద నెలకు రూ.1500 ఇచ్చే పథకం అమలు కావాల్సి ఉంది. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇచ్చే పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్మాలి. ఈ పథకం అమలుకు చాలా డబ్బులు అవసరం ఉంది. ఏం చేయాలి?. ఎలా? పథకం అమలు చేయాలనే అంశం పై ఆలోచన చేస్తున్నాం. సీఎం చంద్రబాబు ఈ పథకం అమలు దిశగా కృషి చేస్తున్నారు’’ అని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Next Story