- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:‘వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారు’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ(Education system)ను నిర్వీర్యం చేశారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి(Minister Dola Bala Veeranjaneya Swamy) విమర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ(Education system)ను నిర్వీర్యం చేశారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి(Minister Dola Bala Veeranjaneya Swamy) విమర్శించారు. ఈ క్రమంలో నేడు(శనివారం) ప్రకాశం జిల్లా సింగరాయకొండ, కొండపిలో పేరెంట్స్, టీచర్స్ సమావేశం(Parent & Teacher Meeting)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి లోకేష్(Minister Lokesh) విద్యా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం(AP Government) అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది అన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. విద్య వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోంది అని తెలిపారు. విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే వేసవి సెలవుల్లోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేస్తాం అన్నారు.
కాస్మోటిక్ ఛార్జీల(Cosmetic charges)ను నగదు రూపంలో కాకుండా విద్యార్థికి కావాల్సిన వస్తువులు కిట్ రూపంలో అందించడం జరుగుతుంది. పాఠశాల స్థాయిలో ఏదైనా సమస్యలుంటే వెంటనే పై అధికారులకు, ప్రధానోపాధ్యాయులు (Principal) తెలియజేయాలి. ఉపాధ్యాయులను శిక్షించటం ప్రభుత్వ ఉద్దేశం కాదు. సమస్యలను గుర్తించి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, వసతులు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు ప్రధానంగా చెబుతున్న సమస్య డ్రైనేజీ సమస్య, అలాగే ప్రహరీగోడ నిర్మించాలని, ఆట స్థలాన్ని చదును చేయాలని చెప్పారు. ఈ క్రమంలో పాఠశాల నుంచి విజ్ఞప్తి చేసిన ప్రతి సమస్యను త్వరలో పరిష్కరిస్తాము అన్నారు.






