- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రామ్మోహన్ను రాజీనామా చేయాలనడం దారుణం’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
గుజారాత్లోని అహ్మదబాద్లో జూన్ 12వ తేదీన జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది.

దిశ,వెబ్డెస్క్: గుజారాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12వ తేదీన జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ విమాన ప్రమాదంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం పై తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించారు. ఈ క్రమంలో విమాన ప్రమాద ఘటన బాధాకరం అన్నారు.
ఈ తరుణంలో కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రీసెంట్గా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్(KA Paul) డిమాండ్ చేశారు. రామ్మోహన్ నాయుడుకు ఎలాంటి అనుభవం లేదని, రామ్మోహన్ చదివింది ఇంజనీరింగ్ అని ఆయనకు ఎలాంటి అనుభవం లేకుండా ఏవియేషన్ మినిస్ట్రీని ఎలా నడిపిస్తారని కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై మంత్రి సత్య కుమార్(Minister Satya Kumar) స్పందిస్తూ.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని రాజీనామా చేయాలనడం సరికాదని తెలిపారు. ఈ క్రమంలో బోయింగ్ విమానాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల కుటుంబాలకు అండగా ఉండి ఆత్మస్థైర్యం పెంచాలని మంత్రి సూచించారు. కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్ గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ పాలనలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగ నిర్వీర్యమైంది అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రం(Andhra Pradesh)లోని అభివృద్ధిని ఓర్వలేకే కొందరు రాష్ట్ర ప్రభుత్వం(AP Government) పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ క్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్లో అవినీతి జరిగిందని తేలితే.. ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి సత్య కుమార్ వెల్లడించారు.
తండ్రిని కోల్పోయా..ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు..విమాన ప్రమాదంపై రామ్మోహన్ నాయుడు






