- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘విద్యా వ్యవస్థ పై బురద జల్లుతున్నారు’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి జవాబు పత్రాల రీవాల్యుయేషన్ పై వైసీపీ, కూటమి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనిపై స్పందిస్తూ.. వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విద్యావ్యవస్థపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బురద జల్లుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లను వీడారని మంత్రి కొండపల్లి ఆరోపించారు. గత, ప్రస్తుత విద్యావిధానానికి వ్యత్యాసం చూడాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీవాల్యుయేషన్‌కు, ప్రస్తుత జరిగిన రీవాల్యుయేషన్‌కు మాజీ మంత్రి బొత్స విశ్లేషించాలని ఆయన ధ్వజమెత్తారు. విద్యారంగంలో కొత్త సంస్కరణలకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.






