‘జగన్‌కు దమ్ముంటే లోకేష్‌తో డిబేట్‌కు రావాలి’.. మంత్రి సంచలన సవాల్

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-03 11:25:33  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటి(జూన్ 4)కి ఏడాది పూర్తవుతుంది.

‘జగన్‌కు దమ్ముంటే లోకేష్‌తో డిబేట్‌కు రావాలి’.. మంత్రి సంచలన సవాల్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటి(జూన్ 4)కి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో 70 శాతం హామీలు నెరవేర్చిందని అన్నారు.

సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందని మంత్రి వాసంశెట్టి వెల్లడించారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వ పాలన పై విమర్శలు గుప్పించారు. నమ్మి అధికారం ఇస్తే మాజీ సీఎం జగన్ ప్రజలను వెన్నుపోటు పొడిచారని మంత్రి ఆరోపించారు. ఈ తరుణంలో వైసీపీ రేపు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు.

ఉర్సాపై వైఎస్ జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్‌కు దమ్ముంటే మంత్రి నారా లోకేష్‌తో డిబేట్‌కు రావాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ సవాల్ చేశారు. బడుగు బలహీన వర్గాల వెన్నుపోటు దారుడు మాజీ సీఎం వైఎస్ జగన్ అని ఆయన దుయ్యబట్టారు. డైవర్ట్ పాలిటిక్స్ వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పేర్కొన్నారు. తెనాలిలో గంజాయి బ్యాచ్‌కు మద్దతుగా జగన్ వెళ్లడం దారుణమన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌ను కామెడీగా చూస్తున్నారని మంత్రి వాసంశెట్టి ఎద్దేవా చేశారు.

Next Story