తునిలో ఘోరం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రులు నారా లోకేశ్),రాంప్రసాద్ రెడ్డి స్పందించారు..

తునిలో ఘోరం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా తుని(Kakinada district Tuni)లో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రులు నారా లోకేశ్(Minister Nara ALokesh),రాంప్రసాద్ రెడ్డి(Minister Ramprasad Reddy) స్పందించారు. ఆ ప్రమాదం తమను ఎంతగానో కలిసివేసిందని ఆవేదన వ్యకం చేస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. విశాఖలో సమావేశానికి హాజరై తిరిగి వెళ్తున్న ముగ్గురు అపోలో ఫార్మసీ ఉద్యోగులు చనిపోవడం చాలా బాధకరమని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. మృతుల కారణంగా వేదనకు గురైన కుటుంబాలకు తాము సానుభూతి చెబుతున్నానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించాలని, వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రులు నారా లోకేశ్, రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

కాగా తుని(Tuni) డిగ్రీ కాలేజీ సమీపంలో ఆగివున్న లారీ(Lorry)ని కారు(Car) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అపోలో ఫార్మసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో వారిని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

Next Story