మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అమలు పై మంత్రి కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి పరిపాలన సాగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అమలు పై మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి పరిపాలన సాగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అనంతపురంలో ఇవాళ(శుక్రవారం) ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి జరిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సీఎంకు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రజల పై చెత్త పన్ను వేసి, ఆ చెత్తను కూడా తీయకుండా వెళ్లిపోయారని విమర్శించారు. హామీ ఇచ్చిన విధంగా తమ ప్రభుత్వం చెత్త పన్ను తీసేసిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Next Story