- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రతి రైతుకు రూ.20వేలు.. మంత్రి కీలక ప్రకటన
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) కొనసాగుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) కొనసాగుతున్నాయి. ఇవాళ(సోమవారం) జరుగుతున్న ఏపీ(Andhra Pradesh) అసెంబ్లీ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదికగా మరోసారి పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి నిరుపేద రైతుకు పరిహారం అందుతుందన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో జమ చేస్తామని వెల్లడించారు.
కౌలు రైతులు, వెబ్ ల్యాండ్‌లో నమోదైన వారికీ పథకం వర్తిస్తుందన్నారు. గత ఐదేళ్లలో వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక్క కార్యక్రమం కూడా జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల విషయంలో కూడా మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రంతో కలిసి హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం(AP Government) ఉంటుందని భరోసా ఇచ్చారు.






