- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీని ఆ దేవుడు కూడా కాపాడలేరు: మంత్రి గొట్టిపాటి సెన్సేషనల్ కామెంట్స్
బాపట్ల జిల్లాలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, కొలుసు పార్థసారథి పర్యటించారు...

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లాలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్(Gottipati Ravi Kumar), కొలుసు పార్థసారథి(Kolusu Partha Saradhi) పర్యటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా(Alapati Madhu)కి మద్దతుగా వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లా నుంచి ఆలపాటిని పట్టభద్రులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలో లేనప్పుడే మూడు ఎమ్మెల్సీ స్థానా(Three MLC posts)ల్లో విద్యావంతులు ఓట్లు వేసి గెలిపించారని గుర్తు చేశారు. విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏడు నెలల కాలంలో చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామన్నారు మంత్రి గొట్టిపాటి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. ధాన్యం సేకరణ, చెల్లింపుల్లో గత ప్రభుత్వం రైతుల(Farmers)ను ఎంతగానో ఇబ్బంది పెట్టిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం(Ycp Government) రైతులకు పెండింగ్ పెట్టిన రూ.1,674 కోట్లను కూటమి సర్కార్ చెల్లించిందన్నారు. పింఛన్లు, ఉచిత గ్యాస్, అన్నా క్యాంటీన్ల ప్రారంభించామని పేర్కొన్నారు. పోలవరం(Polavaram), రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణాలను వేగవంతం చేశామని చెప్పారు. 33 వేల ఎకరాలిచ్చిన రైతుల్ని అవమానించడమే కాకుండా.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు జగన్ అన్యాయం చేశారని చెప్పారు. ఒక్క అవకాశానికే రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్‌కు మరోసారి అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను దేవుడు కూడా కాపాడలేడని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.






