న‌న్నే ఆపుతావా.? డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై మంత్రి త‌మ్ముడు దాడి

by Ajay Maddhiboyina |

ఏపీలో ఓ మంత్రి సోద‌రుడు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డాడు. మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి సోద‌రుడు భూపాల్ రెడ్డి జ‌న‌గాన‌ప‌ల్లెలో కొలిమిగండ్ల ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి వెళ్లారు.

న‌న్నే ఆపుతావా.? డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై మంత్రి త‌మ్ముడు దాడి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో ఓ మంత్రి సోద‌రుడు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డాడు. మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి సోద‌రుడు భూపాల్ రెడ్డి జ‌న‌గాన‌ప‌ల్లెలో కొలిమిగండ్ల ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను లోప‌లికి పంపించాల‌ని భూపాల్ రెడ్డి అడ‌గ్గా కానిస్టేబుల్ సెక్యురిటీ రిత్యా పంపించ‌లేమ‌ని సమాధానం ఇచ్చారు. ఇరువురి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి త‌మ్మ‌డిని, న‌న్నే ఆపుతావా? అంటూ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పైనే చేయి చేసుకున్నారు. మంత్రి త‌మ్మ‌డి దౌర్జ‌న్యం చూసి భ‌క్తులు ఆశ్చ‌ర్య‌పోయారు. గొడ‌వ పెద్ద‌ది కాగా ప‌క్క‌న ఉన్న పోలీసులు ఇరువురుని శాంతింప‌జేశారు. ఈ ఘ‌ట‌న‌తో వైసీపీ నాయ‌కులు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

Next Story