- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రి కందుల సమీక్ష
ఏపీలో సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) సమీక్షించారు. ఈ సమీక్షకు ఎఫ్డీసీ, హోంశాఖ అధికారులు హాజరయ్యారు. టికెట్ ధరల హేతుబద్ధీకరణపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ ధరల హేతుబద్ధీకరణ విషయమై డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో మాట్లాడుతామన్నారు. టికెట్ రేట్లకు ఒకే జీఓ ఉండేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. పెద్ద సినిమాలు, ఆర్టిస్టుల పారితోషికం విషయంపై కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ సహకారంతో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
పాప్ కార్న్ ధర ఎక్కువ : దర్శకుడు తేజ
అనంతరం విలేకరులతో సినీ దర్శకుడు తేజ మాట్లాడుతూ థియేటర్ తో ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. థియేటరులో టికెట్ ధర కంటే పాప్ కార్న్ ధర ఎక్కువ ఉందని పేర్కొన్నారు. ఓటీటీలు, పైరసీ కారణంగా సినీ పరిశ్రమ ఎంతగానో నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.






