- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిలో ఎన్టీఆర్ ఐకానిక్ విగ్రహం ఏర్పాటు కోసం మంత్రుల కమిటీ నియామకం
ఏపీ రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ ఐకానిక్ విగ్రహాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ విగ్రహం ఏర్పాటు కోసం ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ ఐకానిక్ విగ్రహాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ విగ్రహం ఏర్పాటు కోసం ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. కమిటీలో మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని, విగ్రహం డిజైన్ ఏ విధంగా ఉండాలి అనే దానిపై మంత్రుల కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
డీపీఆర్ అప్రూవల్ లాంటి వాటిని మంత్రుల కమిటీ ఫైనల్ చేస్తుంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించిన నమూనా చిత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోలో ఎన్టీఆర్ విగ్రహం భారీగా ఉండగా చుట్టూ పచ్చదనంతో ఎంతో అందంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ విగ్రహం మాదిరిగా కనిపిస్తోంది. ఇక ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రజలకు ఎంతో సేవ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం అభివృద్ధిలో, పథకాల అమలుతో ఆయన తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కాబట్టి ఆయన విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో పెట్టడం ద్వారా గణనివాళి అర్పించినట్టు అవుతుందని భావిస్తున్నారు.






