ఆంధ్రా గడ్డపై కాలుపెడితే తొక్కిపడేస్తాం.. BRSకు మంత్రి వాసంశెట్టి స్ట్రైట్ వార్నింగ్

by Kema Shiva Kumar |

తెలంగాణలో శెట్టిబలిజలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏపీలో అడుగుపెడితే ఊరుకునేది లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు.

ఆంధ్రా గడ్డపై కాలుపెడితే తొక్కిపడేస్తాం.. BRSకు మంత్రి వాసంశెట్టి స్ట్రైట్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: కోనసీమ వేదికగా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamsetty Subhash) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన కేవలం విమర్శలతో ఆగకుండా, సరిహద్దు దాటి వస్తానంటే ఊరుకునేది లేదని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ (BRS) పార్టీకి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణకే పరిమితమైన గులాబీ పార్టీ, ఆంధ్రా గడ్డపై కాలు మోపాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. తెలంగాణలో శెట్టిబలిజలను ఓసీల్లో చేర్చి అన్యాయం చేసిన చరిత్ర కేసీఆర్‌ (KCR)ది అని మండిపడ్డారు. అలాంటి పార్టీ ఇక్కడ అడుగుపెడితే, శెట్టిబలిజలంతా ఏకమై తొక్కి పడేస్తారంటూ మంత్రి నిప్పులు చెరిగారు.

చివరగా ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పైన కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఆ గందరగోళం నుంచి బయటపడాలంటే యోగా ఒక్కటే మార్గమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.

Next Story