ప్రతిపక్షాల మాటలను నమ్మి మోసపోకండి.. మంత్రి ఉషాశ్రీచరణ్

by Javid Pasha |

కంబదూరు మండల కేంద్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి ఉషాశ్రీచరణ్ చేపట్టారు.

ప్రతిపక్షాల మాటలను నమ్మి మోసపోకండి.. మంత్రి ఉషాశ్రీచరణ్
X

దిశ, కళ్యాణదుర్గం: రాబోయే ఎన్నికల్లో ఓటు బ్యాంకు సాధించడం కోసమే ప్రతి పక్షాలు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాయని, వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ తెలిపారు. ఈ సందర్భంగా కంబదూరు మండల కేంద్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను చేపట్టి ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నారు మంత్రి. సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి మంత్రి ఉషాశ్రీచరణ్ తెలుసుకున్నారు. జోగి కాలనీ, గుండ్లపల్లి కాలనీలలో ఉష శ్రీ చరణ్ కి ప్రజలు ఘన స్వాగతం పలికారు.

Next Story