ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఊరుకోం: మంత్రి టీజీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-19 12:56:33  IST  )

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పనులు చేస్తే ఊరుకునేదిలేదని కాంట్రాక్టర్లకు మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు...

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఊరుకోం: మంత్రి  టీజీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పనులు చేస్తే ఊరుకునేదిలేదని కాంట్రాక్టర్లకు మంత్రి టీజీ భరత్(Minister TG Bharat) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లతో కర్నూలు మున్సిపల్ కౌన్సిల్ హాలు(Kurnool Municipal Council Hall)లో సమావేశమైన ఆయన తక్కువ ధరకే పనులు దక్కించుకోవడంపై మండిపడ్డారు. తక్కువ ధరకు పనులు దక్కించుకుంటే నాణ్యతతో ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు మంచి పనులు చేసేందుకే తాము ఉన్నామని, వార్డుల్లో చేపట్టే పనుల్లో నాణ్యత తగ్గించే ఉద్దేశం లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆప్ డూయింగ్ వర్క్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారని, ఇందుకు తగ్గట్టే ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. విశాఖ పట్నం తరహాలో కర్నూలును తీర్చి దిద్దాలని, రానున్న రోజుల్లో పారిశుధ్య పనులు మెరుగుపడాలని, లేదంటే చర్యలు తప్పవని టీజీ భరత్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story