- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓర్వకల్లు వాసులకు తీపి కబురు.. త్వరలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు
ఓర్వకల్లు వాసులకు మంత్రి టీజీ భరత్ తీపి కబురు అందించారు. త్వరలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఓర్వకల్లు(Orvakallu) వాసులకు మంత్రి టీజీ భరత్(Minister TG Bharat) తీపి కబురు అందించారు. త్వరలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కర్నూలులో మెగా ఈ.ఎస్.ఎం. ర్యాలీ(Mega ESM Rally in Kurnool) కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్(Minister TG Bharat).. ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ పార్క్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రిలయన్స్ సంస్థ ఓర్వకల్లులో అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్‌ను త్వరలో అంబానీ వచ్చి ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. రిలయన్స్ సంస్థ ద్వారా 4 వేలమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. కర్నూలులో టీజీవీ సంస్థల తరుపున సేవా కార్యక్రమాలు చేస్తున్నామని టీజీ భరత్ పేర్కొన్నారు.
ఇక ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధంపై జరుగుతున్న వేళ భారత సైన్యంపై మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సరిహద్దులో సైన్యం చేస్తున్న కృషి వల్లే దేశం ప్రశాంతంగా ఉందన్నారు. ప్రజలకు రక్షణ నిలబడిగా సైనికుల సేవలకు వెలకట్టలేమని తెలిపారు. సైనికులు, వారి కుటుంబాలకు ఎలాంటి సమస్యలు ఉన్నా మనం పరిష్కరించాలని టీజీ భరత్ పిలుపునిచ్చారు.






