- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా..?.. అభ్యర్థులకు మంత్రి సవిత కీలక సూచనలు
సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యం నెరవేరేలా బీసీ బిడ్డలు సివిల్ సర్వీసెస్‌లో ఉత్తీర్ణులై అత్యున్నత కొలువులు సాధించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆకాంక్షించారు....

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యం నెరవేరేలా బీసీ బిడ్డలు సివిల్ సర్వీసెస్‌లో ఉత్తీర్ణులై అత్యున్నత కొలువులు సాధించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆకాంక్షించారు. విజయవాడ గొల్లపూడిలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వంట గది, విశ్రాంతి గదులను పరిశీలించారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో మంత్రి సవిత మాట్లాడారు. మౌలిక వసతులు, భోజన సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థుల హాజరు, అధ్యాకుల బోధన గురించి కూడా ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు విద్యాబోధన కూడా బాగుందని అభ్యర్థులు సంతృప్తి వ్యక్తంచేశారు.
మంత్రి సవిత మాట్లాడుతూ కార్పొరేట్‌కు ధీటుగా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్ సర్వీసెస్ శిక్షణ అందజేస్తున్నామన్నారు. బీసీ బిడ్డలు అత్యున్నత స్థానాల్లోనూ, ఉన్నత కొలువుల్లోనూ నిలవాలన్నది సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకుని సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించాలని మంత్రి సవిత తెలిపారు. ఇప్పటికే తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కారించామన్నారు. ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తనకు ఫోన్ చేయాలంటూ తన ఫోన్ నెంబర్ ను అభ్యర్థులకు అందజేశారు. గతంలో బీసీ స్డడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎంతోమంది సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించారన్నారు. అదే స్ఫూర్తితో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
‘మీ విజయాలే రాబోయే బీసీ అభ్యర్థులకు సోపానాలని, బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్ ద్వారా మరింత మందికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి శిక్షణ ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది. మీ నుంచి మేం ఆశించేది మీ విజయమే’ అని మంత్రి స్పష్టం చేశారు.






