- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి పండుగ జగన్ కు సద్భుద్ది ప్రసాదించాలి.. మంత్రి సవిత వ్యంగ్యాస్త్రాలు
మాజీ సీఎం జగన్ పై మంత్రి సవిత వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ఈ సంక్రాంతి పండుగ జగన్ కు సద్భుద్ది ప్రసాదించాలన్నారు. అతి తక్కువ కాలంలో ఏపీ అభివృద్ధి బాటలో పయనిస్తుంటే ఓర్వలేని జగన్ విష ప్రచారం చేస్తున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ పై మంత్రి సవిత వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ఈ సంక్రాంతి పండుగ జగన్ కు సద్భుద్ది ప్రసాదించాలన్నారు. అతి తక్కువ కాలంలో ఏపీ అభివృద్ధి బాటలో పయనిస్తుంటే ఓర్వలేని జగన్ విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్ అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలు అన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని అన్నారు. కేవలం భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుండి ఏపీకి పెట్టుబుడులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అక్రమకేసుల్లో చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావడం చాలా ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఆనాడు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ప్రపంచమంతా ఖండించిందని చెప్పారు. ప్రజలందరికీ చంద్రబాబుపై నమ్మకం ఉందని సంక్రాంతి పండుగ సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పురావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దమ్ముంటే జగన్ ఏదైనా ఒక్క కేసు నుండి అయినా నిర్దోషిగా బయటకు రావాలని సవాల్ చేశారు. పండుగ సమయంలో జగన్ పేరు కూడా ఎత్తకపోవడం మంచిదని వ్యాఖ్యానించారు.






