- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనుకబడిన వర్గాలకు గుడ్ న్యూస్.. ఆర్థిక బలోపేతంపై మంత్రి కీలక ప్రకటన
వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై విజయవాడలో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆమె పాల్గొన్నారు..

దిశ, వెబ్ డెస్క్: వెనుకబడిన వర్గాల(Backward classes)ను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయం(Nature Farming)పై విజయవాడ(Vijayawada)లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ‘ఒక మనిషికి చేప ఇస్తే, మీరు అతనికి ఒక రోజు ఆహారం ఇస్తారు; అదే చేపలు పట్టడం నేర్పిస్తే, జీవితాంతం ఆహారం సంపాదించుకోగలడు’ అని, ఇదీ సీఎం చంద్రబాబు నమ్మిన సిద్ధాంతమని అని చెప్పారు. EWS వర్గాల అభ్యున్నతికి ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే... స్వయం సమృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలను కూడా కూటమి ప్రభుత్వం చేపడుతోందన్నారు. దేశంలోనే అత్యధిక మంది జీవనాధారం వ్యవసాయమని, ప్రస్తుతం ఎరువులు, పురుగు మందులపై పెడుతున్న ఖర్చు అమాంతం పెరిగిపోతోందని చెప్పారు. రసాయనాలపై ఆధారపడకుండా సహజ వనరులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చొచ్చని మంత్రి సవిత చెప్పారు.
ప్రకృతి సాగు ఎంతో ముఖ్యం..
‘‘ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత గురించి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వ్యవసాయం భారం కాకుండా... లాభసాటి కావాలంటే ప్రకృతి సాగు ఎంతో ముఖ్యం. అటు ఆరోగ్యం, ఇటు ఆదాయం... ప్రకృతి వ్యవసాయం వల్లే సాధ్యం. జీవామృతం, ఘనజీవామృతం వంటి సహజ వనరులతో పంటలు పండించొచ్చు. సహజ వనరుల వినియోగంతో నేల సారం పెరుగుతుంది. ప్రస్తుతం ప్రజల ఆహారపు అలవాట్లు మారాయి. ప్రకృతి సాగు ఉత్పత్తులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.’’ అని మంత్రి సవిత తెలిపారు.






