- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుళాయి మరమ్మతులు కూడా చేయని జగన్..!
బీసీల విద్యకు ఎంజేపీ బీసీ గురుకులాల నిర్మాణానికి అప్పట్లో చంద్రబాబు భారీగా నిధులు మంజూరు చేశారని మంత్రి సవిత తెలిపారు....

దిశ, వెబ్ డెస్క్: బీసీల విద్యకు అన్న ఎన్టీఆర్ ప్రాధాన్యమిస్తే, అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) 2014-19 మధ్య 65 ఎంజేపీ బీసీ గురుకులాల నిర్మాణానికి అప్పట్లో రూ.1,210 కోట్లు మంజూరు చేశారని మంత్రి సవిత(Minister Savitha) తెలిపారు. ఆ తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఎంజేపీ గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల గురించి పట్టించుకోలేదన్నారు. చివరికి పులివెందులలో బీసీ బాలిక గురుకుల పాఠశాల నిర్మాణాన్ని కూడా గాలి కొదిలేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాకతో పులివెందుల ఎంజేపీ బాలిక గురుకుల పాఠశాల నిర్మాణం ఊపందుకుందన్నారు. రాబోయే జూన్ లో సీఎం చంద్రబాబుతో పులివెందుల ఎంజేపీ బాలిక గురుకుల పాఠశాలను ప్రారంభించబోతున్నామని మంత్రి సవిత తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంలో...
5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో బీసీ హాస్టళ్లలో చాలా దారుణ పరిస్థితులు నెలకున్నాయని, కనీసం పాడైపోయిన కుళాయిలకు కూడా మరమ్మతులు చేయలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే బీసీ హాస్టళ్లలో మరమ్మతులు చేయించిందన్నారు. రూ. 60 కోట్ల సీఎస్ఆర్, డీఎంఎఫ్ నిధులతో మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.110 కోట్ల డైట్ బకాయిలు చెల్లించామని మంత్రి సవిత గుర్తు చేశారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో సన్నబియ్యంతో భోజనంతో పాటు నాణ్యమైన విద్య అందిస్తూ ఉత్తమ ఫలితాలు రాబడుతున్నామని, ఇది బీసీలు, బీసీ విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సవిత వెల్లడించారు.






